౧ యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత... గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంత ములకు వచ్చెను. ౨ బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. ౩ పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చిఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా ౪ ఆయనసృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించెననియు ౫ ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? ౬ కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీర ముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. ౭ అందుకు వారుఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ౮ ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. ౯ మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా డనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పు చున్నానని వారితోననెను. ౧౦ ఆయన శిష్యులుభార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ౧౧ అందు కాయనఅనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ౧౨ తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంస కులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
యేసు పిల్లలను ఆశీర్వదిస్తాడు
౧౩ అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయ వలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ౧౪ ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దిం పగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి ౧౫ వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.
అపొస్తలుల కార్యములు ౨౬
అగ్రిప్ప ఎదుట పౌలు
౧ అగ్రిప్ప పౌలును చూచినీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను ౨ అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్త మైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక ౩ యూదులు నామీద మోపిన నేరము లన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను. ౪ మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు. ౫ వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ౬ ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీ క్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. ౭ మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు. ౮ దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు? ౯ నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; ౧౦ యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెర సాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; ౧౧ అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములక ౧౨ అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా ౧౩ రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ౧౪ మేమందరమును నేలపడినప్పుడుసౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ౧౫ అప్పుడు నేనుప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేనునీవు హింసించుచున్న యేసును. ౧౬ నీవు నన్ను చూచి యున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను.నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; ౧౭ నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; ౧౮ వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
కీర్తనల గ్రంథము ౪౨
నీటి కోసం జింక ప్యాంటు వలె
౧ దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ౨ నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? ౩ నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను. ౪ జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది. ౫ నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ౬ నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను. ౭ నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి. ౮ అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ౯ కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ౧౦ నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు. ౧౧ నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
లేవీయకాండము ౧౪
చర్మ వ్యాధుల శుద్ధీకరణ
౧ మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ౨ కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను. ౩ యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల ౪ యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ౫ అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి ౬ సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి ౭ కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను. ౮ అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివ సింపవలెను. ౯ ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. ౧౦ ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను. ౧౧ పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. ౧౨ అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింప వలెను. ౧౩ అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థ మైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము. ౧౪ అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను. ౧౫ మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను. ౧౬ అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. ౧౭ యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను. ౧౮ అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజ కుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ౧౯ అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను. ౨౦ యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును. ౨౧ వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లా డించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను ౨౨ వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను. ౨౩ వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను. ౨౪ యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. ౨౫ అప్పు డతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను వధింప వలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను. ౨౬ మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని ౨౭ తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను. ౨౮ మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను. ౨౯ యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను. ౩౦ అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను. ౩౧ తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజ కుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. ౩౨ కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధి యిదే.
బూజు నుండి శుద్ధీకరణ
౩౩ మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను ౩౪ నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల ౩౫ ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను. ౩౬ అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. ౩౭ అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల ౩౮ యాజ కుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను. ౩౯ ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల ౪౦ యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను. ౪౧ అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింప వలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి ౪౨ వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. ౪౩ అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. ౪౪ అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము. ౪౫ కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. ౪౬ మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. ౪౭ ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.
ఇంటిని శుభ్రపరచడం
౪౮ యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ౪౯ ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని ౫౦ పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ౫౧ ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను. ౫౨ అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను. ౫౩ అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ౫౪ ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు ౫౫ వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు, ౫౬ వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగ లాడు మచ్చను గూర్చియు, ౫౭ ఒకడు ఎప్పుడు అపవిత్రుడ గునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.
లేవీయకాండము ౧౫
పురుషుల అపరిశుభ్రత
౧ మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను ౨ మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును. ౩ వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము; ౪ వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. ౫ వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ౬ అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. ౭ స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. ౮ స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమి్మవేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ౯ స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. ౧౦ వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ౧౧ స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ౧౨ స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడు గవలెను.
పురుషుల ప్రక్షాళన
౧౩ స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును. ౧౪ ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. ౧౫ యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ౧౬ ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ౧౭ ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును. ౧౮ వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.
స్త్రీల అపరిశుభ్రత
౧౯ స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. ౨౦ ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ౨౧ ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ౨౨ ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ౨౩ అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. ౨౪ ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రు డగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ౨౫ ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. ౨౬ ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. ౨౭ వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
స్త్రీల ప్రక్షాళన
౨౮ ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించు కొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. ౨౯ ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను. ౩౦ యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ౩౧ ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను. ౩౨ స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, ౩౩ స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.