0 నిమిషాల పఠనం

మత్తయి సువార్త ౧౮

పాపం చేసే సోదరుడు
౧౫ మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.
౧౬ అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడు నట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. ౧౭ అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ౧౮ భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్ప బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నా పేరుతో అడగండి
౧౯ మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.
౨౦ ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
క్షమించని సేవకుడు
౨౧ ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.
౨౨ అందుకు యేసు అత నితో ఇట్లనెనుఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. ౨౩ కావున పర లోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. ౨౪ అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాం తులు2 అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. ౨౫ అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమి్మ, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపిం చెను. ౨౬ కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కినాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ౨౭ ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. ౨౮ అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనార ములు3 అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను ౨౯ అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడు కొనెను గాని ౩౦ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. ౩౧ కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. ౩౨ అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; ౩౩ నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. ౩౪ అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను. ౩౫ మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వక ముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.

అపొస్తలుల కార్యములు ౨౫

ఫేస్తు అగ్రిప్పాను సంప్రదించాడు
౧౩ కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.
౧౪ వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగాఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు. ౧౫ నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. ౧౬ అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మను ౧౭ కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయ పీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని. ౧౮ నేరము మోపినవారు నిలిచి నప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు. ౧౯ అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను; ౨౦ ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనోయేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింప బడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని. ౨౧ అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు నిలిపియుంచవ లెనని ఆజ్ఞాపించితిననెను. ౨౨ అందుకు అగ్రిప్పఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడురేపు వినవచ్చునని చెప్పెను.
అగ్రిప్ప మరియు బెర్నీస్ ముందు పౌలు
౨౩ కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.
౨౪ అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరువీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయు ౨౫ ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను. ౨౬ ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించి యున్నాను. ౨౭ ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచు చున్నదని చెప్పెను.

కీర్తనల గ్రంథము ౪౧

పేదలను పరిగణించేవాడు ధన్యుడు
బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు. కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను ౧౦ యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను. ౧౧ నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. ౧౨ నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ౧౩ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్‌. ఆమేన్‌.

లేవీయకాండము ౧౧

శుభ్రమైన మరియు అపరిశుభ్రమైన జంతువులు
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడిభూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును; జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని ​నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.
జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్ర ములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.
౧౦ సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచర ముల లోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలు సులు ఉండవో అవన్నియు మీకు హేయములు; ౧౧ అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంస మును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. ౧౨ నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
౧౩ పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,
౧౪ క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, ౧౫ ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, ౧౬ ​కపిరిగాడు, కోకిల, ౧౭ ​​ప్రతివిధమైన డేగ, ౧౮ ​పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, ౧౯ ​​సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
౨౦ రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరము లన్నియు మీకు హేయములు.
౨౧ అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును. ౨౨ ​నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును. ౨౩ ​నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
౨౪ వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.
౨౫ వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. ౨౬ ​రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. ౨౭ నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును; ౨౮ వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.
౨౯ నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,
౩౦ ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక. ౩౧ ​ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. ౩౨ వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును. ౩౩ వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను. ౩౪ తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము. ౩౫ వాటి కళే బరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్ర మగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. ౩౬ అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్ర మగును. ౩౭ వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తన ములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని ౩౮ ​ఆ విత్తన ములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
౩౯ మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.
౪౦ ​దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
౪౧ నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.
౪౨ నేలమీద ప్రాకు జీవరాసు లన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు. ౪౩ ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు. ౪౪ నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. ౪౫ నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
౪౬ అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
౪౭ జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.

లేవీయకాండము ౧౨

పిల్లలు పుట్టిన తరువాత శుద్ధీకరణ
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను. ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను. ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.
కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.
అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి. ఆమె గొఱ్ఱ పిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.

లేవీయకాండము ౧౩

చర్మ వ్యాధులు గురించిన ఆదేశాలు
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మ మందు కుష్ఠుపొడవంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజ కులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను. ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను. ​ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను. ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.
అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.
౧౦ యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుక లను తెల్లబారినయెడలను, వాపులో పచ్చి మాంసము కన బడినయెడలను, ౧౧ అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అప విత్రుడు. ౧౨ కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలు కొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల ౧౩ యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు. ౧౪ అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. ౧౫ యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము. ౧౬ ​అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకునియొద్దకు రావలెను; ౧౭ యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు.
౧౮ ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత
౧౯ ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దానికనుపరచవలెను. ౨౦ యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ. ౨౧ యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. ౨౨ అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ. ౨౩ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.
౨౪ దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానే గాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.
౨౫ నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము. ౨౬ యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను. ౨౭ ఏడవనాడు యాజ కుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే. ౨౮ అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.
౨౯ పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా
౩౦ అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన యెడల, వాడు అపవిత్రు డని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము. ౩౧ యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచి నప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేని యెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ౩౨ ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను, ౩౩ వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ౩౪ ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. ౩౫ వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను, ౩౬ అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు. ౩౭ అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజ కుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
౩౮ మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల
౩౯ యాజకుడు వానిని చూడ వలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.
౪౦ తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయి నను వాడు పవిత్రుడు.
౪౧ ​ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు. ౪౨ అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి యందైనను పుట్టిన కుష్ఠము. ౪౩ యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మ మందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల ౪౪ వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.
౪౫ ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
౪౬ ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
బూజు గురించిన ఆదేశాలు
౪౭ మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి
౪౮ నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునం దేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి ౪౯ ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కను పరచవలెను. ౫౦ యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. ౫౧ ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అప విత్రము. ౫౨ ​కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను. ౫౩ ​అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపిం పక పోయినయెడల ౫౪ ​యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచ వలెను. ౫౫ ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.
౫౬ యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.
౫౭ అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరు కుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ౫౮ ఏ వస్త్రమునేగాని పడు గునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉది కినతరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;
౫౯ అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేక యందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.