౩౬ అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు. ౩౭ నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. ౩౮ జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి ౩౯ జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును. ౪౦ ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ౪౧ ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. ౪౨ కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ౪౩ ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. ౪౪ మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ౪౫ యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? ౪౬ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ౪౭ అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ౪౮ అయితే దుష్టు డైన యొక దాసుడునా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని ౪౯ తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ౫౦ ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును. ౫౧ అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
రోమీయులకు ౭
పాపతో పోరాడుతోంది
౧౩ ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. ౧౪ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. ౧౫ ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ౧౬ ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. ౧౭ కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. ౧౮ నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. ౧౯ నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ౨౦ నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. ౨౧ కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ౨౨ అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని ౨౩ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. ౨౪ అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? ౨౫ మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.
కీర్తనల గ్రంథము ౫౮
దేవుడు భూమికి తీర్పు తీరుస్తాడు
౧ అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు రన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు దురా? ౨ లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించు చున్నారు. ౩ తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ౪ వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను ౫ వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు. ౬ దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము. ౭ పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును. ౮ వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు. ౯ మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు, ౧౦ ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగు కొందురు. ౧౧ కావుననిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.
సంఖ్యాకాండము ౨౬
ఇశ్రాయేలీయులయొక్క రెండవ జనాభా గణన
౧ ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను ౨ మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. ౩ కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రా యేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు ౪ మోయాబు మైదానము లలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.
రూబేను తెగ
౫ ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు; ౬ పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు; ౭ వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది. ౮ పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము. ౯ కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ౧౦ ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి. ౧౧ అయితే కోరహు కుమారులు చావలేదు.
౩౫ ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు, ౩౬ వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు. ౩౭ వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.
బెన్యామీను తెగ
౩౮ బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు; ౩౯ అహీరామీయులు అహీరాము వంశస్థులు; ౪౦ షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు. ౪౧ వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
దాను తెగ
౪౨ దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు; ౪౩ వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.
ఆషేరు తెగ
౪౪ ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు; ౪౫ బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు; ౪౬ ఆషేరు కుమార్తె పేరు శెరహు. ౪౭ వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.
నఫ్తాలీ తెగ
౪౮ నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు; ౪౯ యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. ౫౦ వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది ౫౧ ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.
లాట్ ద్వారా వారసత్వం
౫౨ యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ౫౩ ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను; ౫౪ తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్య వలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రము లకు స్వాస్థ్యము ఇయ్యవలెను. ౫౫ చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ౫౬ ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్య మును వారికి పంచిపెట్టవలెను.
లేవీయుల సంఖ్య
౫౭ వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు. ౫౮ లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీ యుల వంశము కోరహీయుల వంశము. ౫౯ కహాతు అమ్రా మును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. ౬౦ అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. ౬౧ నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. ౬౨ వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్య బడలేదు.
కాలేబు మరియు జాషువా మాత్రమే మిగిలారు
౬౩ యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు. ౬౪ మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండ లేదు. ౬౫ ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
సంఖ్యాకాండము ౨౭
సెలోపెహాదు కూతుళ్ళు
౧ అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థు లలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. ౨ వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగామా తండ్రి అరణ్యములో మరణ మాయెను. ౩ అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను. ౪ అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్య మును మాకు దయచేయుమనిరి. ౫ అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా
వారసత్వాల చట్టం
౬ యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమా ర్తెలు చెప్పినది యుక్తము. ౭ నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. ౮ మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. ౯ వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. ౧౦ వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను. ౧౧ వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.
మోషే తరువాత యెహోషువ నాయకుడు
౧౨ మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. ౧౩ నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు. ౧౪ ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే. ౧౫ అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. ౧౬ అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి, ౧౭ వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
మోషే వారసుడిగా యెహోషువ
౧౮ అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనునూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి ౧౯ యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము; ౨౦ ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ౨౧ యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. ౨౨ యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి ౨౩ అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.