౪౩ ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫల ములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ౪౪ ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. ౪౫ సజ్జనుడు, తన హృద యమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయ టికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయ ములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
గట్టి నేలపై కట్టిన ఇల్లు
౪౬ నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? ౪౭ నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. ౪౮ వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలి యుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున2 దాని కదలింపలేకపోయెను. ౪౯ అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్ప దని చెప్పెన
ఫిలిప్పీయులకు ౪
౮ మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. ౯ మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
ఫిలిప్పియన్ల దాతృత్వం
౧౦ నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. ౧౧ నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. ౧౨ దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చు కొనియున్నాను. ౧౩ నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
కీర్తనల గ్రంథము ౧౨౧
నేను నా కళ్ళను కొండల వైపు లేపుతాను
౧ కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? ౨ యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ౩ ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ౪ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ౫ యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ౬ పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ౭ ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును ౮ ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
రాజులు రెండవ గ్రంథము ౨౨
ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం
౧ యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా. ౨ అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు,కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.
జోషియ ఆలయాన్ని బాగు చేస్తున్నాడు
౩ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు, మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారు డును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఈలాగు సెల విచ్చెను. ౪ నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి, ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము. ౫ యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించువారిచేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాతయెహోవా మందిర మందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దాని నియ్యవలె ననియు ౬ వడ్లవారికిని శిల్పకారులకును కాసెపని వారికిని మందిరమును బాగుచేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియ జెప్పుము. ౭ ఆ అధికారులు నమ్మకస్థులని వారి చేతికి అప్ప గించిన ద్రవ్యమునుగూర్చి వారియొద్ద లెక్క పుచ్చుకొన కుండిరి.
హిల్కియా చట్టం యొక్క పుస్తకాన్ని కనుగొన్నాడు
౮ అంతట ప్రధానయాజకుడైన హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథ మును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి ౯ రాజునొద్దకు తిరిగి వచ్చిమీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పనివిషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్ప గించిరని వర్తమానము తెలిపి ౧౦ యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆగ్రంథమును రాజు సముఖమందు చదివెను. ౧౧ రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపుమాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ౧౨ తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా ౧౩ మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.
హుల్దా ప్రవచనం
౧౪ కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారు డైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా ౧౫ ఈమె వారితో ఇట్లనెనుమిమ్మును నాయొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియ జెప్పుడి ౧౬ యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును. ౧౭ ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొను చున్నది. ౧౮ యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి ౧౯ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీ కరించియున్నాను. ౨౦ నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చు దును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు.నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి.
రాజులు రెండవ గ్రంథము ౨౩
నిబంధనను యోషీయా పునరుద్ధరణ
౧ అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని...యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి ౨ యూదావారినందరిని యెరూషలేము కాపురస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను. ౩ రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మ తోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.
యోషీయా విగ్రహారాధనను నాశనం చేస్తాడు
౪ రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను. ౫ మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రు లకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను. ౬ యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను. ౭ మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. ౮ యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను. ౯ అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. ౧౦ మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను. ౧౧ ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంట పములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను. ౧౨ మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. ౧౩ యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొ మోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి ౧౪ ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. ౧౫ బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. ౧౬ యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను. ౧౭ అంతట అతడునాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి. ౧౮ అందు కతడుదానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. ౧౯ మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిర ములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. ౨౦ అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజ కులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరశల్య ములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
యోషీయా పస్కాను పునరుద్ధరించాడు
౨౧ అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా ౨౨ ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను. ౨౩ ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. ౨౪ మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహ ములను, యూదాదేశమందును యెరూష లేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీ యాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. ౨౫ అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు. ౨౬ అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను. ౨౭ కాబట్టి యెహోవానేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.
యోషీయా మరణం
౨౮ యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ౨౯ అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. ౩౦ అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
యెహోయాహాజు యోషీయా విజయం సాధించాడు
౩౧ యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు. ౩౨ ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను. ౩౩ ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి ౩౪ యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను. ౩౫ యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను.
యూదాలో యెహోయాకీమ్ దుష్ట పాలన
౩౬ యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ౩౭ ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.