౧ మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ౨ మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ౩ ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. ౪ అయినను మాంస మును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. ౫ మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
షెమ్ ఆశీర్వాదం మరియు నోవహు మరణం
౬ నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ౭ మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ౮ మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ౯ ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, ౧౦ పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. ౧౧ నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. ౧౨ మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే. ౧౩ మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధ నకు గురుతుగా నుండును. ౧౪ భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. ౧౫ అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు ౧౬ ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. ౧౭ మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
నోవహు కుమారులు
౧౮ ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ౧౯ ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
నోవహు యొక్క సిగ్గు మరియు కనాను యొక్క శాపం
౨౦ నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను. ౨౧ పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ౨౨ అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ౨౩ అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు. ౨౪ అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని ౨౫ కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. ౨౬ మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును. ౨౭ దేవుడు యా పెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను. ౨౮ ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను. ౨౯ నోవహు బ్రదికిన దినములన్నియు తొమి్మదివందల ఏబది యేండ్లు; అప్పు డతడు మృతిబొందెను.
యెహొషువ ౧౧
ఉత్తర పాలస్తీనా ఓడిపోయింది
౧ హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ౨ ఉత్తరదిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణదిక్కుననున్న అరా బాలోను షెఫేలా లోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజు లకును ౩ తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయుల కును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా ౪ వారు సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకొని, విస్తారమైన గుఱ్ఱములతోను రథములతోను బయలుదేరిరి. ౫ ఆ రాజులందరు కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్లయొద్దకు వచ్చిదిగగా ౬ యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్ప గించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను. ౭ కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా ౮ యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతముచేసి మహాసీదోనువరకును మిశ్రేపొత్మాయిమువర కును తూర్పువైపున మిస్పే లోయవరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. ౯ యెహోవా యెహోషువతో సెల విచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చి వేసెను. ౧౦ ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ౧౧ ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. ౧౨ యెహోషువ ఆ రాజులనందరిని హతముచేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను; యెహోవా సేవ కుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. ౧౩ అయితే యెహోషువ హాసో రును కాల్చి వేసెనుగాని మెట్టలమీద కట్టబడియున్న పట్టణ ములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ౧౪ ఆ పట్టణ ముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీ యులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. ౧౫ యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించి నట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ ఆలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడువలేదు.
యెహోషువ మొత్తం భూమిని తీసుకుంటాడు
౧౬ యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని ౧౭ లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదువరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణదేశమంతటిని గోషేనుదేశమంతటిని షెఫేలాప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండ లను వాటి లోయలను వాటి రాజులనందరిని పట్టుకొని వారిని కొట్టిచంపెను. ౧౮ బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసు లైన హివ్వీయులుగాక ౧౯ ఇశ్రాయేలీయులతో సంధిచేసిన పట్టణము మరి ఏదియులేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధములో పట్టుకొనిరి. ౨౦ వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను. ౨౧ ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ౨౨ ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయు లలో ఎవడును మిగిలియుండలేదు; గాజాలోను గాతు లోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. ౨౩ యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.
యెహొషువ ౧౨
మోషే చేతిలో ఓడిపోయిన రాజుల జాబితా
౧ ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా ౨ అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగ మును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువ రకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న ౩ అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ౪ ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను ౫ హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు. ౬ యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.
యెహోషువ చేతిలో ఓడిపోయిన రాజుల జాబితా
౭ యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. ౮ మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు ౯ బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, ౧౦ హెబ్రోను రాజు, యర్మూతు రాజు, ౧౧ లాకీషు రాజు, ఎగ్లోను రాజు, ౧౨ గెజెరు రాజు, దెబీరు రాజు, ౧౩ గెదెరు రాజు, హోర్మా రాజు, ౧౪ అరాదు రాజు, లిబ్నా రాజు, ౧౫ అదుల్లాము రాజు, మక్కేదా రాజు, ౧౬ బేతేలు రాజు, తప్పూయ రాజు, ౧౭ హెపెరు రాజు, ఆఫెకు రాజు, ౧౮ లష్షారోను రాజు, మాదోను రాజు, ౧౯ హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, ౨౦ అక్షాపు రాజు, తానాకు రాజు, ౨౧ మెగిద్దో రాజు, కెదెషు రాజు. ౨౨ కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, ౨౩ గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, ౨౪ ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
కీర్తనల గ్రంథము ౯
నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుతాను
౧ నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదనుయెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను. ౨ మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నానునీ నామమును కీర్తించెదను. ౩ నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు ౪ కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. ౫ నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులనునశింపజేసి యున్నావువారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు. ౬ శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండనిర్మూలమైరినీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండబొత్తిగా నశించెను. ౭ యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు.న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు. ౮ యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చునుయథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ౯ నలిగినవారికి తాను మహా దుర్గమగునుఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును ౧౦ యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు ౧౧ సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడిఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ౧౨ ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనునువారి మొఱ్ఱను ఆయన మరువడు. ౧౩ నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచుసీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము. ౧౪ మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా,నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము. ౧౫ తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి.తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది. ౧౬ యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు.దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.) ౧౭ దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు. ౧౮ దరిద్రులు నిత్యము మరువబడరుబాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికినినశించదు. ౧౯ యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాకనీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. ౨౦ యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక.(సెలా.)
మత్తయి సువార్త ౭
ఇతరులను తీర్పు తీర్చడం
౧ మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. ౨ మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. ౩ నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? ౪ నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? ౫ వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును. ౬ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
ప్రార్థనకు ప్రోత్సాహం
౭ అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును. ౮ అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును. ౯ మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? ౧౦ మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా ౧౧ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. ౧౨ కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.
రెండు దారులు (కీర్తన 1)
౧౩ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ౧౪ జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
కపట బోధకుల గురించి హెచ్చరికలు
౧౫ అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ౧౬ వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయు దురా? ౧౭ ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును. ౧౮ మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ౧౯ మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ౨౦ కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. ౨౧ ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ౨౨ ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. ౨౩ అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
విశ్వాసం లేకుండా నోటి మాటల వల్ల లాభం లేదు
౨౪ కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. ౨౫ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. ౨౬ మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ౨౭ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
యేసు యొక్క అధికారం
౨౮ యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహ ములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ౨౯ ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.