౬౦ ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ౬౧ యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెనుదీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? ౬౨ ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు? ౬౩ ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని ౬౪ మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును. ౬౫ మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. ౬౬ అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.
పేతురు విశ్వాసపు ఒప్పుకోలు
౬౭ కాబట్టి యేసుమీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా ౬౮ సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; ౬౯ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను. ౭౦ అందుకు యేసునేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను. ౭౧ సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
1 పేతురు ౪
దేవుని మహిమ కొరకు జీవించుట
౧ క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ౨ శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. ౩ మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, ౪ అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ౫ సజీవుల కును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు. ౬ మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను. ౭ అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ౮ ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి. ౯ సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ౧౦ దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి. ౧౧ ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్.
పరమగీతము ౬
స్నేహితులు
౧ స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?
పెళ్లి కూతురు
౨ ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను. ౩ నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
పరస్పర ఆనందం
౪ నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు ౫ నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి. ౬ నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నవి. ౭ నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి. ౮ అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు. ౯ నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు. ౧౦ సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?
పెళ్లి కూతురు
౧౧ లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని. ౧౨ తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.
స్నేహితులు
౧౩ షూలమీ్మతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమీ్మతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?
విలాపవాక్యములు ౧
నగరం ఎంత ఒంటరిగా ఉంది!
౧ జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను? ౨ రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక డును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి. ౩ యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక ౪ సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను. ౫ దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి ౬ సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి పోయిరి. ౭ యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువుచేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని నపహాస్యము చేసిరి. ౮ యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది ౯ దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. ౧౦ దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది ౧౧ దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా రము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము. ౧౨ త్రోవనునడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. ౧౩ పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు. ౧౪ కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారియెదుట లేవలేకపోతిని. ౧౫ నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యుల నందరిని కొట్టివేసెను నా ¸°వనులను అణగద్రొక్కవలెనని ఆయన నామీద నియామక కూటముకూడను చాటిం చెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. ౧౬ వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి. ౧౭ ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని విరోధులైయుండ నియమించియున్నాడు యెరూషలేము వారికి హేయమైనదాయెను. ౧౮ యెహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలును నా ¸°వనులును చెరలోనికిపోయి యున్నారు ౧౯ నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి. ౨౦ యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. ౨౧ నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువా డొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. ౨౨ వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రుంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.