౩౨ ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు. ౩౩ జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ౩౪ ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.) ౩౫ ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ౩౬ ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. ౩౭ నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.
2 కొరింథీయులకు ౧౨
పౌలు యొక్క ప్రకటన
౧ అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసివచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ౨ క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. ౩ అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. ౪ అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
పౌలు యొక్క ముల్లు మరియు దేవుని దయ
౫ అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను. ౬ అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగ ౭ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. ౮ అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ౯ అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె ౧౦ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.
కీర్తనల గ్రంథము ౧౦౭
అతని ప్రేమపూర్వక దయ ఎప్పటికీ ఉంటుంది
౧ యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. ౨ యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును ౩ తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. ౪ వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడు చుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. ౫ ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ౬ వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను ౭ వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. ౮ ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ౯ ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. ౧౦ దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున ౧౧ బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును ౧౨ ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. ౧౩ కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ౧౪ వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను. ౧౫ ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ౧౬ ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు. ౧౭ బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు. ౧౮ భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణద్వారములను సమీపించుదురు. ౧౯ కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ౨౦ ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను. ౨౧ ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ౨౨ వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక. ౨౩ ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయు వారు ౨౪ యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ౨౫ ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను ౨౬ వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. ౨౭ మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి. ౨౮ శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ౨౯ ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. ౩౦ అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ౩౧ ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ౩౨ జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక ౩౩ దేశనివాసుల చెడుతనమునుబట్టి ౩౪ ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను. ౩౫ అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి ౩౬ వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి ౩౭ వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను ౩౮ మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు ౩౯ వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు ౪౦ రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు. ౪౧ అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను. ౪౨ యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు. ౪౩ బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తల పోయు దురుగాక.
సమూయేలు రెండవ గ్రంథము ౧
సౌలు మరణ వార్త దావీదు వినడం
౧ దావీదు అమాలేకీయులను హతముచేసి తిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను. ౨ మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను. ౩ అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. అందుకు వాడుఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను. ౪ జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. ౫ సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను ౬ గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. ౭ అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని. ౮ నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని. ౯ అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను ; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ౧౦ ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. ౧౧ దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్ద నున్న వారందరును ఆలాగున చేసి ౧౨ సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి. ౧౩ తరువాత దావీదునీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడునేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను. ౧౪ అందుకు దావీదుభయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? ౧౫ యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; ౧౬ నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
సౌలు, యోనాతానుల మరణ వార్త గురించి దావీదు విలాపం
౧౭ యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. ౧౮ అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా ౧౯ ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి. ౨౦ ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. ౨౧ గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక.బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను.తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను. ౨౨ హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు. ౨౩ సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు. ౨౪ ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు. ౨౫ యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారునీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను. ౨౬ నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది. ౨౭ అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరియుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.
సమూయేలు రెండవ గ్రంథము ౨
దావీదు యూదా రాజుగా అభిషేకం
౧ ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను.నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ౨ కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. ౩ మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. ౪ అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ౫ సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపిమీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక. ౬ యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. ౭ మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.
ఇశ్రాయేలుకు, యూదాకు మధ్య యుధం
౮ నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి, ౯ గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ౧౦ సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేల నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. ౧౧ దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
అబ్నేరు మరియు యోవాబు మధ్య అంతర్యుద్ధం
౧౨ అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా ౧౩ సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా ౧౪ అబ్నేరు లేచిమన యెదుట ¸°వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను. ౧౫ లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి. ౧౬ ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని1 ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. ౧౭ తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి. ౧౮ సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక ౧౯ అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా ౨౦ అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను. ౨౧ నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸°వనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా ౨౨ అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను. ౨౩ అతడునేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని ౨౪ యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను. ౨౫ బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా ౨౬ అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను. ౨౭ అందుకు యోవాబుదేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి ౨౮ బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. ౨౯ అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. ౩౦ యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి. ౩౧ అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి. ౩౨ జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.