౧ యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము. ౨ నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను. ౩ యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును. ౪ నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు ౫ డాంబికులు నీ సన్నిధిని నిలువలేరుపాపము చేయువారందరు నీకసహ్యులు ౬ అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువుకపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ౭ నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదనునీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయముదిక్కు చూచి నమస్కరించెదను ౮ యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టినీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుమునీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. ౯ వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ౧౦ దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము. ౧౧ నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు. ౧౨ యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు.
కీర్తనల గ్రంథము ౬
నీ కోపంలో నన్ను మందలించకు
౧ యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుమునీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. ౨ యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుముయెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము ౩ నా ప్రాణము బహుగా అదరుచున్నది.యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? ౪ యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము. ౫ మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు? ౬ నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవు చున్నది. ౭ విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి. ౮ యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడుపాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి. ౯ యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడుయెహోవా నా ప్రార్థన నంగీకరించును. ౧౦ నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
సమూయేలు మొదటి గ్రంథము ౭
సమూయేలు ఫిలిష్తీయులను లొంగదీసుకున్నాడు
౧ అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మంద సమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ౨ మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహో వాను అనుసరింప దుఃఖించుచుండగా ౩ సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును. ౪ అంతట ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవత లను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ౫ అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా ౬ వారు మిస్పాలో కూడు కొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండియెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీ యులకు న్యాయము తీర్చుచువచ్చెను. ౭ ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు విని నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి ౮ మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి ౯ సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ౧౦ సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ౧౧ ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయు లను తరిమి హతము చేసిరి. ౧౨ అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపియింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు1 అను పేరు పెట్టెను. ౧౩ ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ౧౪ మరియు ఫిలిష్తీయులు ఇశ్రా యేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రా యేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోనునుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.
సమూయేలు ఇజ్రాయెల్ న్యాయమూర్తి
౧౫ సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ౧౬ ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ౧౭ మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.
సమూయేలు మొదటి గ్రంథము ౮
ఇజ్రాయెల్ రాజును కోరింది
౧ సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రా యేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను. ౨ అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా, ౩ వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ౪ ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి ౫ చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ౬ మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను. ౭ అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు. ౮ వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ౯ అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.
రాజుల గురించి శామ్యూల్ హెచ్చరిక
౧౦ సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి ౧౧ ఈలాగున చెప్పెనుమిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు. ౧౨ మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. ౧౩ మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. ౧౪ మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును. ౧౫ మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును. ౧౬ మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని1 పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును. ౧౭ మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ౧౮ ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.
దేవుడు అభ్యర్థనను మంజూరు చేస్తాడు
౧౯ అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లకఆలాగున కాదు, ౨౦ జనములు చేయురీతిని మేమును చేయునట్లుమాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. ౨౧ సమూయేలు జనులయొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్ని ధిని వాటిని వివరించెను ౨౨ గనుక యెహోవానీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలుమీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.
కీర్తనల గ్రంథము ౪౬
దేవుడు మన ఆశ్రయం మరియు బలం
౧ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ౨ కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను ౩ వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.) ౪ ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి. ౫ దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు. ౬ జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది. ౭ సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. ౮ యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ౯ ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ౧౦ ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును ౧౧ సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
కీర్తనల గ్రంథము ౪౭
ప్రజలారా, చప్పట్లు కొట్టండి
౧ సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి. ౨ యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు. ౩ ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. ౪ తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. ౫ దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. ౬ దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. ౭ దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. ౮ దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధసింహాసనముమీద ఆసీనుడై యున్నాడు. ౯ జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను.
మార్కు సువార్త ౧
యేసు అపవిత్రమైన ఆత్మను వెళ్లగొట్టాడు
౨౧ అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ౨౨ ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ౨౩ ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను. ౨౪ వాడునజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. ౨౫ అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ౨౬ ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. ౨౭ అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. ౨౮ వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
పేతురు ఇంట్లో యేసు స్వస్థత పొందాడు
౨౯ వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి. ౩౦ సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి. ౩౧ ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ౩౨ సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి; ౩౩ పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను. ౩౪ ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
యేసు ప్రార్థిస్తాడు మరియు బోధిస్తాడు
౩౫ ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. ౩౬ సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ౩౭ ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ౩౮ ఆయనఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ౩౯ ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.
కుష్టురోగి శుద్ధి
౪౦ ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ౪౧ ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. ౪౨ వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. ౪౩ అప్పుడాయనఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; ౪౪ కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. ౪౫ అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలు
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.