0 నిమిషాల పఠనం

కీర్తనల గ్రంథము ౧౧౯

౧౦౫ (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. ౧౦౬ నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. ౧౦౭ యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. ౧౦౮ యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము ౧౦౯ నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ౧౧౦ నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు. ౧౧౧ నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. ౧౧౨ నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము. ౧౧౩ (సామెహ్‌) ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ౧౧౪ నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. ౧౧౫ నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. ౧౧౬ నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. ౧౧౭ నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. ౧౧౮ నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువు వారి కపటాలోచన మోసమే. ౧౧౯ భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి ౧౨౦ నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. ౧౨౧ (అయిన్‌) నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము. ౧౨౨ మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక. ౧౨౩ నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. ౧౨౪ నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము ౧౨౫ నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ జేయుము ౧౨౬ జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ౧౨౭ బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. ౧౨౮ నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు. ౧౨౯ (పే) నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. ౧౩౦ నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును ౧౩౧ నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. ౧౩౨ నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము. ౧౩౩ నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. ౧౩౪ నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. ౧౩౫ నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. ౧౩౬ జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.

హొషేయ ౭

ఎఫ్రాయిమ్ యొక్క అధర్మం
నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.
తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగిననుమన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.
వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.
రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారం దరు మానని కామాతురతగలవారై యున్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయ ములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.
ఎఫ్రా యిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.
అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ౧౦ ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.
౧౧ ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.
౧౨ వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.
౧౩ వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ద ములు చెప్పుదురు
౧౪ హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయు దురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు. ౧౫ ​నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు. ౧౬ ​వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము ౬

లేవీ వంశస్థులు
లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను, అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను, ​మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను, అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను, ౧౦ యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. ౧౧ ​అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, ౧౨ అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, ౧౩ షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను, ౧౪ అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను. ౧౫ ​యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
లేవీ వంశాలు
౧౬ లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
౧౭ ​గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ. ౧౮ కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు. ౧౯ ​మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా ౨౦ ​గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, ౨౧ జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి. ౨౨ కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, ౨౩ అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, ౨౪ అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు. ౨౫ ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు. ౨౬ ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు, ౨౭ నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా. ౨౮ సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు. ౨౯ ​మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా ౩౦ ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
ఆలయ సంగీతకారులు
౩౧ నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.
౩౨ సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ౩౩ ​ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు ౩౪ ​సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను, ౩౫ తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను, ౩౬ అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను, ౩౭ జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను, ౩౮ ​కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. ౩౯ ​​హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, ౪౦ షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు,బయశేయా మల్కీయా కుమారుడు, ౪౧ ​మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు, ౪౨ అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు, ౪౩ షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. ౪౪ మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు, ౪౫ హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు, ౪౬ హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు, ౪౭ ​షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. ౪౮ వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.
అహరోను వంశస్థులు
౪౯ అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.
౫౦ అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ, ౫౧ అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య, ౫౨ జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, ౫౩ అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
లేవీయుల ప్రాంతము
౫౪ అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.
౫౫ యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. ౫౬ అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. ౫౭ అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు, ౫౮ హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ౫౯ ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు. ౬౦ మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
౬౧ కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.
౬౨ గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను. ౬౩ ​మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను. ౬౪ ​ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి. ౬౫ వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.
౬౬ కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.
౬౭ ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును, ౬౮ ​యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును, ౬౯ ​అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను. ౭౦ మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
౭౧ మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
౭౨ ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, ౭౩ రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ౭౪ ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, ౭౫ హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు; ౭౬ నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్య బడెను.
౭౭ మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు,
౭౮ ​యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, ౭౯ కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, ౮౦ గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, ౮౧ ​హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

హెబ్రీయులకు ౧౧

మోసెస్ విశ్వాసం
౨౩ మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
౨౪ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, ౨౫ అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ౨౬ ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. ౨౭ విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ౨౮ తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ౨౯ విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
అనేకుల విశ్వాసం
౩౦ విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
౩౧ విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను. ౩౨ ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు. ౩౩ వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి; ౩౪ అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి. ౩౫ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి. ౩౬ మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి. ౩౭ రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, ౩౮ అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ౩౯ వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, ౪౦ దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.