0 నిమిషాల పఠనం

కీర్తనల గ్రంథము ౯౨

మీ రచనలు ఎంత గొప్పవి
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
​నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు. ౧౦ గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ౧౧ నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను ౧౨ నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగు దురు ౧౩ యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ౧౪ నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై ౧౫ వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు.

కీర్తనల గ్రంథము ౯౩

ప్రభువు పాలన!
యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.

యెహెజ్కేలు ౪౫

భూమి యొక్క పవిత్రీకరణ
మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహో వాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండ వలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠిత మగును.
దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,
​కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థల ముండును.
యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పా టైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు
ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను.
​మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయ వలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండ వలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును.
రాకుమారుడి భాగం
​మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణము నకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడ మటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణము నకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పు వరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు
​అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. ​మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నిజాయితీ ప్రమాణాలు
౧౦ ​ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను.
౧౧ ​తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను. ౧౨ తులమొకటింటికి ఇరువది చిన్న ముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.
నైవేద్యాలు మరియు విందులు
౧౩ ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.
౧౪ తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును. ౧౫ మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱ లలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.
౧౬ ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్ప ణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.
౧౭ ​పండుగలలోను, అమా వాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రా యేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడ బడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిధ్దపరచవలెను.
౧౮ ​ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగామొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింప వలెను.
౧౯ ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశు రక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను. ౨౦ తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరము నకు ప్రాయశ్చి త్తము చేయుటకై నెల యేడవ దినమందు ఆలాగు చేయవలెను.
౨౧ మొదటి నెల పదునాలుగవ దిన మున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.
౨౨ ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను. ౨౩ మరియు ఏడు దినములు అతడు నిర్దోష మైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింప వలెను. ౨౪ మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను. ౨౫ మరియు ఏడవ నెల పదునైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.

ప్రసంగి ౯

మృత్యువు మంచి చెడులకు వస్తుంది
నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించు టయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది యంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని.
సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభ వించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలుల నర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము. బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
ఈ జీవితంలో మీ భాగాన్ని ఆస్వాదించండి
నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.
ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము. ​దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖిం చుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.
౧౦ చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
౧౧ మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగు చున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.
౧౨ తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
బలం కంటే జ్ఞానం ఉత్తమం
౧౩ మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను.
౧౪ ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి; దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను; ౧౫ అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. ౧౬ ​కాగా నేనిట్లను కొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. ౧౭ బుద్ధిహీనులలో ఏలువాని కేకలకంటె మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు. ౧౮ యుద్ధా యుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును.

2 కొరింథీయులకు ౧౦

పౌలు అపొస్తలత్వ సమర్థన
మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము. మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను. ౧౦ అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును. ౧౧ మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను. ౧౨ తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు. ౧౩ మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము. ౧౪ మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్న వారము కాము. ౧౫ మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు, ౧౬ మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము. ౧౭ అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ౧౮ ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.