౧ దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. ౨ నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. ౩ శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టులబలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు. ౪ నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది ౫ దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను. ౬ ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే ౭ త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని ౮ అరణ్యములో నివసించియుందునే అను కొంటిని. ౯ పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము. ౧౦ రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. ౧౧ దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. ౧౨ నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును. ౧౩ ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. ౧౪ మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము. ౧౫ వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది ౧౬ అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. ౧౭ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును ౧౮ నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు. ౧౯ పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును. ౨౦ తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. ౨౧ వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే. ౨౨ నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ౨౩ దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమి్మకయుంచి యున్నాను.
యిర్మీయా ౧౦
దేవుని సార్వభౌమాధికారం
౧ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ౨ యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింప కుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ౩ జన ముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని. ౪ వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు. ౫ అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయ నేరవు మేలుచేయుట వాటివలనకాదు. ౬ యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘన మైనదాయెను. ౭ జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ౮ జనులు కేవలము పశు ప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము. ౯ తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే. ౧౦ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ౧౧ మీరు వారితో ఈలాగు చెప్పవలెనుఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండ కుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును. ౧౨ ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. ౧౩ ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును. ౧౪ తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు. ౧౫ అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును, ౧౬ యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రా యేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.
యూదా యొక్క రాబోయే బందిఖానా
౧౭ నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లు టకై నీ సామగ్రిని కూర్చుకొనుము. ౧౮ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడునేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను. ౧౯ కటకటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించు దును. ౨౦ నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయి యున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడార మును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు. ౨౧ కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి. ౨౨ ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. ౨౩ యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ౨౪ యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము. ౨౫ నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థిం పని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయ వలెనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాస మును పాడుచేయుచున్నారు.
యోబు గ్రంథము ౧౩
యోబు తన స్నేహితులను ఖండించాడు
౧ ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను.నా చెవి దాని విని గ్రహించియున్నది ౨ మీకు తెలిసినది నాకును తెలిసేయున్నదినేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను. ౩ నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నానుదేవునితోనే వాదింప గోరుచున్నాను ౪ మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు. ౫ మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును. ౬ దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెమునాలకించుడి. ౭ దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ౮ ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా? ౯ ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరుఆయనను మోసముచేయుదురా? ౧౦ మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడలనిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ౧౧ ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?ఆయన భయము మీ మీదికి రాదా? ౧౨ మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములు ౧౩ నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడినామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక. ౧౪ నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను ౧౫ ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. ౧౬ ఇదియు నాకు రక్షణార్థమైనదగునుభక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. ౧౭ నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడినా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ౧౮ ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నానునేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును. ౧౯ నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొనిప్రాణము విడిచెదను. ౨౦ ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను. ౨౧ నీ చెయ్యి నామీదనుండి తొలగింపుమునీ భయము నన్ను బెదరింపనీయకుము ౨౨ అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము ౨౩ నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. ౨౪ నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు? ౨౫ ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవువేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా? ౨౬ నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావునా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగానీవు విధించియున్నావు ౨౭ బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు ౨౮ మురిగి క్షీణించుచున్న వానిచుట్టుచిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
అపొస్తలుల కార్యములు ౬
ప్రథమ సంఘ పరిచారకులు
౧ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ౨ అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. ౩ కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; ౪ అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ౫ ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని ౬ వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి. ౭ దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
మూడవ హింసాకాండ: మహాసభ ఎదుట స్తెఫను
౮ స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ౯ అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫన ౧౦ మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. ౧౧ అప్పుడు వారువీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ౧౨ ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి ౧౩ అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారుఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా వ ౧౪ ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. ౧౫ సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.